సందడిగా “తంగలాన్” ప్రమోషన్స్

చియాన్ విక్రమ్ (Chiyaan vikram) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” (Thangalaan) ఈ నెల 15న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో సందడి చేశారు “తంగలాన్” మూవీ టీమ్. హీరో చియాన్ విక్రమ్, హీరోయిన్ మాళవిక మోహనన్ (Malvika mohanan), హాలీవుడ్ నటుడు డేనియల్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఫేమస్ బాబాయ్ హోటల్ లో విక్రమ్, మాళవిక టిఫిన్స్ చేశారు. అలాగే వీవీఐటీ కాలేజ్ లో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు.

“తంగలాన్” చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ (pa ranjith) రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ (Studio green) బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది.