“తంగలాన్” హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్

చియాన్ విక్రమ్(Chiyaan vikram) హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ తంగలాన్(Thangalaan) హిందీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ఈ నెల 30న నార్త్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు పా రంజిత్(Pa ranjith) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సన్ ఆఫ్ గోల్డ్ నార్త్ ఇండియాకు వస్తున్నాడు అంటూ ఆయన రిలీజ్ డేట్ పోస్టర్ ట్వీట్ చేశారు. తమిళం, తెలుగులో తంగలాన్ మంచి హిట్ కావడంతో హిందీ ఆడియెన్స్ లోనూ ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

తంగలాన్ సినిమాను నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద కేఈ జ్ఞానవేల్ రాజా(KE jnanavel raja) నిర్మించారు. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ నెల 15న తెలుగు, తమిళంలో థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పుడు హిందీ ఆడియెన్స్ ను పలకరించనుంది.