తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ షో

హారర్ కామెడీ మూవీగా వచ్చిన ఆరణ్మని తెలుగులో కళావతి పేరుతో రిలీజైంది. ఈ సినిమా సక్సెస్ సాధించి సిరీస్ గా మారింది. ఇప్పటికి ఆరణ్మని సిరీస్ లో మూడు సినిమాలు రాగా ఇప్పుడు నాలుగో మూవీ బాక్ పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. కళావతి 4గా పెట్టాల్సిన పేరును బాక్ గా మార్చారు.

సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ నెల 26న బాక్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇవాళ ఈ సినిమా నుంచి పంచుకో అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ చేసే స్టెప్పులతో సాంగ్ ప్రేమో ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో తమన్నా, రాశీ ఖన్నా పోటీ పడి గ్లామర్ షో చేశారు.