తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓదెల 2 సినిమా టీజర్ ను ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంపత్ నంది కథా స్క్రీన్ ప్లే మాటలు అందిస్తుండగా..అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 మరింత బిగ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓదెల 2 టీజర్ తమన్నాను ఇప్పటిదాకా చూడని ఓ కొత్త మేకోవర్ లో శివసత్తి పాత్రలో చూపించింది.
తిరిగొచ్చిన దుష్టశక్తిని అడ్డుకుని ప్రజల్ని కాపాడేందుకు సాక్షాత్తూ పరమశివుడే వస్తే ఎలా ఉంటుందనే అంశాలు టీజర్ లో ఆకట్టుకునేలా ఉన్నాయి. తమన్నా క్యారెక్టర్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. అలాగే సీజీ వర్క్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈవిల్ క్యారెక్టర్స్ ను గూస్ బంప్స్ వచ్చేలా చూపించారు. తమన్నా కెరీర్ లో ఓదెల 2 ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుంది.