బాక్సాఫీస్ పోటీలో హీరోలు ఉండటం చూస్తుంటాం. కానీ ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా ఈ పోటీ ఎక్కువైంది. గతంలో దేవిశ్రీ ప్రసాద్, థమన్ మధ్య ఇన్ సైడ్ వార్ నడిచింది. ఒకరి సినిమాలు మరొకరు తీసుకున్నారంటూ టాక్ వచ్చింది. ఈ సంక్రాంతికి మాత్రం థమన్, భీమ్స్ మధ్య మ్యూజికల్ కాంపిటేషన్ జరుగుతోంది. థమన్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. ఈ సంక్రాంతికి వస్తోన్న సినిమాల్లో బాలకృష్ణ నటిస్తోన్న డాకు మహారాజ్ మూవీకి థమనే మ్యూజిక్ అందించాడు. ఇప్పటి వరుకు ఈ మూవీ నుంచి మూడు పాటలు రిలీజ్ చేశారు. టైటిల్ సాంగ్, ఎమోషనల్ సాంగ్ అండ్ మాస్ సాంగ్. అయితే.. ఈ మూడు పాటలు ఆకట్టుకున్నాయి కానీ.. బ్లాక్ బస్టర్ సాంగ్స్ కాలేదు. సినిమా రిలీజ్ తర్వాత మరింతగా పాపులర్ అవ్వచ్చు. ఇక థమన్ మ్యూజిక్ అందించిన మరో సినిమా గేమ్ ఛేంజర్. రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ ఛేంజర్ నుంచి కూడా మూడు పాటలు వచ్చాయి. ఈ సినిమా పాటల్లో శంకర్ మార్క్ గ్రాండ్ విజువల్స్, చరణ్ డ్యాన్స్ బాగున్నాయి. పాటలు హిట్ అయ్యాయి.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ నుంచి గోదారి గట్టు అంటూ సాగే పాట రిలీజ్ చేస్తే వెంటనే జనాలకు నచ్చేసింది. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ పాటను రమణ గోగులతో పాడించడం ప్లస్ అయ్యింది. ఇక సెకండ్ సింగిల్ మీను సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇటీవల పొంగల్ సాంగ్ అంటూ వెంకీ పాడిన పాటను రిలీజ్ చేస్తే.. ఆ పాట కూడా జనాలకు బాగా నచ్చేసింది. ఈ రకంగా సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీ సినిమా పాటలు దూసుకెళుతున్నాయి. ఇప్పటి వరుకు అయితే.. భీమ్స్ పాటలే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.