తమిళ చిత్ర పరిశ్రమలో నలుగురు పేరున్న హీరోలపై నిర్మాతల మండలి కొరడా ఝలిపించింది. హీరోలు విశాల్, ధనుష్, శింభు, అధర్వలకు రెడ్ కార్డ్ జారీ చేయబోతున్నట్లు సమాచారం. దీని వల్ల ఈ హీరోలతో నిర్మాతలెవరూ సినిమాలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
గతంలో తమ సినిమా నిర్మాణ సమయంలో ధనుష్, విశాల్, శింభు, అధర్వలు నిర్మాతలకు సహకరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. వారు సినిమా మేకింగ్ లో సహకరించకపోవడం వల్లే సదరు సినిమాలు ఆగిపోయాయని, అందువల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారని తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటోంది. దీంతో ఈ హీరోలను నిషేధించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ స్టార్ పొజిషన్ లో ఉన్న విశాల్, ధనుష్, శింభు తో పాటు యువ నటుడు అధర్వ ను బ్యాన్ చేయడం అంత సులువు కాదంటున్నాయి చిత్ర పరిశ్రమ వర్గాలు. నిర్మాతలు ఈ హీరోల మధ్య ఒక ఒప్పందం కుదరనుందని టాక్ వినిపిస్తోంది. దాంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడనుంది.