తమిళ హీరోకు తప్పిన ఘోర ప్రమాదం

తమిళ నటుడు జీవా(Jeeva) ఘోర రోడ్డు ప్రమాదాన్ని(Road accident) తప్పించుకున్నారు. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. జీవా అతని భార్య కలిసి చెన్నై నుంచి సేలంకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో కన్నియమూర్ అనే ప్రాంతంలో బైక్ ను తప్పించబోయి జీవా కారు రోడ్డు మీద ఏర్పాటు చేసిన బార్ కేడ్ల ను ఢీకొట్టింది.

బలంగా బార్ కేట్లను ఢీకొట్టడంతో జీవా కారు బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో జీవా, అతని భార్య క్షేమంగా బయటపడ్డారు. జీవా కారు ప్రమాదం ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ సోషల్ మీడియాలోకి రావడంతో జీవా క్షేమాన్ని కోరుతూ నెటిజన్స్ పోస్ట్ లు చేస్తున్నారు.