డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల పూరి సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో ఆయనతో సినిమా చేసేందుకు తెలుగు హీరోలు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఈసారి పూరి కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీని రెడీ చేసి విజయ్ సేతుపతికి చెబితే వెంటనే ఓకే చెప్పాడట. ఉగాదికి ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం హీరోయిన్ టబును కాంటాక్ట్ చేశారని తెలిసింది. ఈ పాత్ర చేసేందుకు టబు ఓకే చెప్పిందని తెలిసింది. టబు తెలుగులో అల..వైకుంఠపురములో తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. ఇప్పుడు పూరి చెప్పిన స్టోరీ.. అందులో ఆమె క్యారెక్టర్ కొత్తగా ఉండడంతో వెంటనే ఓకే చెప్పిందని తెలిసింది. ఈ సినిమా సక్సెస్ పూరి జగన్నాథ్ కి చాలా కీలకం. ఈ ఇయర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.