మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. కొన్ని కారణాల వలన కుదరలేదు. సమ్మర్ కి వస్తుంది అనుకుంటే.. సమ్మర్ కు కూడా వచ్చేలా లేదు. ఆ తర్వాత చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 21న విశ్వంభర రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. ఆగష్టు 21న కూడా రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు చిరు ఫోకస్ అంతా అనిల్ రావిపూడితో చేస్తోన్న మూవీ పైనే పెట్టారు. దీంతో విశ్వంభర సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది.
ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని టాక్ వినిపిస్తోంది. విశ్వంభర కథా కథనాలతో పాటు గ్రాఫిక్స్ కూడా అంతే ప్రాధాన్యతతో ఉంటాయని తెలుస్తుంది. అందుకే వశిష్ట్ ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ కోసం చాలా కష్టపడుతున్నారట. సినిమాలోని కొన్ని విజువల్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉంటాయని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పక్కాగా కంప్లీట్ అయిన తర్వాతే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారట. మరో టీజర్ రెడీ చేస్తున్నారని.. ఆ టీజర్ తో రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది.