బన్నీ, సందీప్ రెడ్డి మూవీ ఉందా.? లేదా..?

అర్జున్ రెడ్డి సినిమాతో తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సాధించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆతర్వాత కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించడంతో అనతి కాలంలోనే టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే.. ఆమధ్య బన్నీతో సినిమాని ప్రకటించాడు కానీ.. ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైంది..?

సందీప్ రెడ్డి(Sandeep vanga) వంగ.. యానిమల్ మూవీతో సంచలనం సృష్టించడంతో ఈ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనే సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే.. ఈ మూవీ కంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) తో ఓ మూవీ అనౌన్స్ చేశారు. దీంతో యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే ప్రభాస్ తో స్పిరిట్(Spirit) మూవీ చేయనున్నాడని తెలిసింది. ఈ సినిమా అక్టోబర్ లో స్టార్ట్ కావాలి కానీ.. జనవరిలో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించనున్నాడు. ప్రభాస్ ను ఇంత వరకు ఎవరూ చూపించని విధంగా పవర్ ఫుల్ గా, చాలా కొత్తగా చూపించనున్నాడని సమాచారం.

ప్రభాస్(Prabhas) మూవీ తర్వాత బన్నీతో మూవీ ఉంటుందా అంటే.. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఇటీవల తెలంగాణలోని ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ తో స్పిరిట్, రణ్ బీర్ కపూర్ తో యానిమల్ పార్క్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. అయితే.. బన్నీతో సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఆతర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేయనున్నాడు. అలాగే అట్లీతో మూవీ కూడా చర్చల్లో ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో బన్నీ, సందీప్ మూవీ ఏమైంది అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వాలంటే.. కాస్త ఎక్కువ టైమే పట్టేలా ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.