మెగాస్టార్ చిరంజీవి, కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ధమాకా రైటర్ బెజవాడ ప్రసన్న ఈ చిత్రానికి కథ అందించారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని మెగా డాటర్ సుస్మిత తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చిందట. సినిమా నిర్మాణ వ్యయం మొత్తం భరిస్తామని.. లాభంలో సగం వాటా ఇస్తే చాలు.. సుస్మిత బ్యానర్ తో పాటు తమ బ్యానర్ కూడా యాడ్ చేయమని ప్రపోజ్ చేశారట.
ఈ ప్రపోజల్ చిరంజీవికి బాగా నచ్చిందట కానీ.. మెగా డాటర్ సుస్మితకు మాత్రం నచ్చలేదట. తను నాన్నతో సోలో ప్రొడ్యూసర్ గా సినిమా చేయాలి అనుకుంటుందట. ఈ సినిమాకి సంబంధించి క్రెడిట్ తనకే రావాలని.. లాభం, నష్టంతో సంబంధం లేదు అంటుందట. చిరు చెప్పినా సుస్మిత నో చెబుతుందట. తనే నిర్మాతగా ఉండాలి తప్పా.. మరో నిర్మాతతో కలిసి సినిమా నిర్మించాలి అనుకోవడం లేదట. అయితే.. చిరు మాత్రం సుస్మితను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. అందుకనే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదని టాక్. దీంతో చిరు, కళ్యాణ్ కృష్ణ మూవీ ఏ బ్యానర్ లో వస్తుంది..? సుస్మిత సొంత బ్యానర్ లో వస్తుందా..? లేక వేరే బ్యానర్ తో కలిసి సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మిస్తుందా..? అనేది ఆసక్తిగా మారింది. త్వరలో క్లారిటీ వచ్చిన తర్వాత ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు.