అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్. కెరీర్ బిగినింగ్ నుంచి మాస్ హీరోగా మెప్పించాలని ట్రై చేశాడు కానీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఆ ప్రయత్నం అంతగా ఫలించలేదు. ఇప్పుడు సోలో హీరోగా తన 10వ చిత్రాన్ని ప్రకటించాడు. డైరెక్టర్ పృథ్వీరాజ్ చిట్టెట్టి ఈ మూవీని రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సుశాంత్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ పోస్టర్ ఉంది. ఇందులో సుశాంత్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. అతీంద్రియ శక్తుల ఉండే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ ఇది. సుశాంత్ సినిమా రిలీజై దాదాపు నాలుగేళ్లు అవుతుంది. ఇందులో సుశాంత్ భూతవైద్యుడుగా నటిస్తున్నాడని తెలిసింది. సుశాంత్ కు హీరోగా ఇది చివరి అవకాశం అనుకోవచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.