రోలెక్స్ సినిమాపై సూర్య ఇంట్రెస్టింగ్ అప్ డేట్

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన కెరీర్ లోనే ప్రెస్టీజియస్ మూవీ కంగువలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవలే కంగువ టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా పనుల్లోనే సూర్య బిజీగా ఉన్నారు. అయితే తన కొత్త చిత్రాలనూ ఆయన లైనప్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కొత్త సినిమాల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చారు.

సూర్య మాట్లాడుతూ – ప్రస్తుతం నా దృష్టి అంతా కంగువ వర్క్స్ మీదే ఉంది. ఈ సినిమా తర్వాత వెట్రి మారన్ దర్శకత్వంలో చేస్తున్న వాడివాసల్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. దర్శకుడు లోకేష్ రోలెక్స్ క్యారెక్టర్ తో ఓ స్టోరీ చెప్పారు. ఆ కథ నాాకు బాగా నచ్చింది. త్వరలో ఆ సినిమా చేస్తాం. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అని చెప్పారు.

కమల్ హాసన్ హీరోగా దర్శకుడ లోకేష్ రూపొందించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఇందులో సూర్య గెస్ట్ రోల్ రోలెక్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా రోలెక్స్ క్యారెక్టర్ చేశారు సూర్య. ఇప్పుడు ఇదే క్యారెక్టర్ తో కంప్లీట్ మూవీ వస్తుందంటే ఫిల్మ్ లవర్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.