సర్ ప్రైజ్ చేస్తున్న “జవాన్” బాక్సాఫీస్ నెంబర్స్

షారుఖ్ లేటెస్ట్ సెన్సేషన్ జవాన్ బాక్సాఫీస్ నెంబర్స్ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఓ సూపర్ స్టార్ కు సూపర్ హిట్ పడితే ఎలా ఉంటుందో జవాన్ కలెక్షన్స్ చూపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా అన్ని బాలీవుడ్ రికార్డులను తుడిచేసి ఎవర్ గ్రీన్ రికార్డ్స్ వైపు పరుగులు పెడుతోంది. రిలీజైన నాలుగు రోజుల్లో 523 కోట్ల రూపాయలు ఆర్జించడం ఈ సినిమాకే దక్కిన ఫీట్.

జవాన్ ఫస్ట్ ఫోర్ డేస్ లో ఓవర్సీస్ లో 21 మిలియన్ డాలర్స్ కు పైగా వసూళ్లు చేసి చరిత్ర సృష్టించింది. ఇండియా బిజినెస్ తో కలిపి ఫస్ట్ వీకెండ్ కు 523 కోట్ల రూపాయలు దక్కించుకుంది. జవాన్ క్రియేట్ చేస్తున్న ఈ సెన్సేషన్ బాలీవుడ్ హీరోలను కూడా సర్ ప్రైజ్ చేస్తోంది.

అక్షయ్ కుమార్ జవాన్ కలెక్షన్స్ పై స్పందించారు. ఇదొక మాసివ్ సక్సెస్. మా షారుఖ్ కు కంగ్రాట్స్. మన సినిమాలు మళ్లీ సక్సెస్ ట్రాక్స్ లో పడ్డాయి. అంటూ ట్వీట్ చేశారు. పఠాన్ బ్లాక్ బస్టర్ తర్వాత జవాన్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు షారుఖ్.