సూర్య హీరోగా నటించిన కంగువ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఆస్కార్ 2025 జ్యూరీ పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 323 సినిమాల్లో కంగువ ఉండటం విశేషం. ఈ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డ్ గెల్చుకునే అవకాశం ఉంది. కంగువతో పాటు భారత్ నుంచి షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ ఆడుజీవితం, హిందీ సినిమా స్వతంత్ర వీర్ సావర్కర్, సంతోష్ ఉన్నారు.
ఈ నెల 12వ తేదీతో ఆస్కార్ నామినేషన్స్ ముగుస్తాయి. ఫిబ్రవరిలో ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఉంటుంది. మన దేశం నుంచి లాపతా లేడీస్ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్ కు పంపినా చివరి నిమిషంలో పోటీ నుంచి నిష్క్రమించింది. కంగువ, గోట్ లైఫ్ .. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులకు ఒక భిన్నమైన అనుభూతిని కలిగించాయి. సూర్య ఎంతో ప్రెస్టీజియస్ గా కంగువ మూవీ చేశారు.