19 ఏళ్ల తర్వాత మరోసారి సూర్య, త్రిష జోడీ

సూర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో నాయికగా త్రిష కనిపించనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రకటించింది. సూర్య సరసన త్రిష గతంలో ఆరు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత సూర్య45లో జోడీగా కనిపించనున్నారు సూర్య, త్రిష.

సూర్య చిత్రంలో త్రిష హీరోయిన్ గా మేకర్స్ చేసిన అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ఆర్జే బాలాజీ సూర్య45 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలాకాలం తర్వాత సూర్య ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేస్తుండటం విశేషం. రీసెంట్ గా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.