నవంబర్ 14న సూర్య ‘కంగువ’ రిలీజ్

స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కంగువ(Kanguva) కొత్త రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. నవంబర్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి రాబోతోంది. అక్టోబర్ 10న దసరా రిలీజ్ అని ముందు అనుకున్నా..మరింత బెస్ట్ ఔట్ పుట్ కోసం నవంబర్ 14న కంగువ రిలీజ్ చేస్తున్నారు. ఈ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో సూర్య, విలన్ బాబీ డియోల్ ఉన్న మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ(Director Siva) రూపొందిస్తున్నారు. దిశా పటానీ(Disha patani), బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.