స్టార్ హీరో సూర్య నటిస్తున్న 44వ చిత్రానికి ‘రెట్రో’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సూర్య తన 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ ఇంటెన్స్ యాక్షన్ తో ఆకట్టుకుంది. హీరో సూర్య క్యారెక్టరైజేషన్ కొత్తగా కనిపించింది. పూజా హెగ్డేకు ఇంపార్టెంట్ రోల్ ఉన్నట్లు టైటిల్ టీజర్ తో తెలుస్తోంది. ‘రెట్రో’ మూవీలో మంచి రొమాన్స్, ఎమోషన్ కూడా ఉంది. సూర్య కెరీర్ లో ఇదొక డిఫరెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కాబోతోంది.