అఫీషియల్ – సూర్య ‘కంగువ’ ట్రైలర్ డేట్ ఫిక్స్

స్టార్ హీరో సూర్య (Suriya) చేస్తున్న మరో బిగ్ టికెట్ మూవీ కంగువ (Kanguva). పీరియాడిక్ సెటప్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా కంగువ తెరకెక్కుతోంది. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా రిలీజ్ కు రెడీ అవుతుండగా..రెండు నెలల ముందుగానే ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ నెల 12వ తేదీన కంగువ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఈ రోజు ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ కోసం సూర్య ఫ్యాన్స్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రాన్ని దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ (Disha patani), బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ (Studio green), యూవీ క్రియేషన్స్ (UV creatons) బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.