‘దేవర’ డేట్ కు వస్తున్న ‘కంగువ’

స్టార్ హీరో సూర్య (Suriya) ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (kanguva) రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘కంగువ’ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో యుద్ధ వీరుడు సూర్య శత్రువుల శవాల గుట్టపై నిలబడి విజయ చిహ్నంగా కత్తిని చూపిస్తున్నాడు. ఈ పోస్టర్ తో సూర్య పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో మరోసారి తెలుస్తోంది.

వాస్తవానికి అక్టోబర్ 10న ఎన్టీఆర్ (NTR) దేవర (Devara) రిలీజ్ కావాల్సిఉంది. పవన్ ( Pawan kalyan) ఓజీ (OG) సెప్టెంబర్ 27 నుంచి పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ ను దేవర తీసుకుంది. దేవర స్లాట్ కు సూర్య ‘కంగువ’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ (Disha patani), బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ (Studio green), యూవీ క్రియేషన్స్ (Uv creations) బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.