లవ్ స్టోరీ మూవీ చేయనున్న సుప్రీమ్ హీరో

సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ క్రేజీ లైనప్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డెబ్యూ డైరెక్టర్ రోహిత్ తో సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్‌ రిలీజ్ చేసిన సంబరాల ఏటిగట్టు అందరినీ ఆకట్టుకుని సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. హనుమాన్ ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ భారీ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తేజ్ ఈ సినిమా తర్వాత ఓ విభిన్న ప్రేమకథా చిత్రం చేయాలి అనుకుంటున్నాడనే వార్త వినిపిస్తోంది.

ఓ తమిళ దర్శకుడు తేజ్ కోసం ఓ ప్రేమకథను రెడీ చేశాడట. ఇది మామూలు ప్రేమ కాదు అనేది టైటిల్ అని సమాచారం. గత రెండు సంవత్సరాలుగా తమిళ డైరెక్టర్ ఈ కథ పై కసరత్తు చేస్తున్నాడని తెలిసింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందట. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్టుగా ప్లాన్ చేసిన తేజ్ ఇక నుంచి రెండు సినిమాలను ఒకేసారి చేయాలి అనుకుంటున్నాడట.