సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న భారీ, క్రేజీ మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఏ ముహూర్తాన ఈ చిత్రాన్ని ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను ఆగష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అనుకున్న విధంగా షూటింగ్ జరగకపోవడంతో సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు కానీ… షూటింగ్ కి బ్రేకులు పడడంతో సంక్రాంతికి వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రావడం ఖాయం అని ప్రకటించారు. ప్రస్తుతం హైదరబాద్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. నవంబర్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. సంక్రాంతికి రానున్న గుంటూరు కారం ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.