రూ.వంద కోట్ల చెక్ అందుకున్న సూపర్ స్టార్

స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్టయ్యితే ఆ లాభాల్లోంచి షేర్ తీసుకుంటారు. ఇది రెమ్యునరేషన్ కు అదనం. రజనీ కూడా సినిమా సైన్ చేసే ముందు ఇదే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇలా ఆయన కొత్త సినిమా జైలర్ లాభాల్లోంచి అందుకున్న వాటానే వంద కోట్ల రూపాయలు. రీసెంట్ గా ఈ చెక్ ను నిర్మాత కళానిధి మారన్ రజనీ కాంత్ ఇంటికి వెళ్లి ఆయనకు అందజేశారు. రజనీ రెమ్యునరేషన్ 110 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించగా..ఇప్పుడీ 100 కోట్ల రూపాయలతో కలిపి జైలర్ కు రజనీ ఆర్జన 210 కోట్ల రూపాయలు అయ్యింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అ‌వుతోంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా గత నెల 10న రిలీజై ఘన విజయం సాధించింది. ఈ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ కు చేరువవుతోంది. ఈ సినిమాలో తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ కీ రోల్స్ చేశారు. పవర్ ఫుల్ ఫ్యామిలీ, యాక్షన్ మూవీగా జైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ తో తమిళనాట బాక్సాఫీస్ రికార్డులన్నీ తుడిచేశారు రజనీకాంత్. జైలర్ సూపర్ హిట్ తో ఇటీవల తన వరుస ఫ్లాప్స్ భారం నుంచి రిలీఫ్ అయ్యారీ సౌతిండియన్ సూపర్ స్టార్.