‘ముఫాసా’కు మహేశ్ డబ్బింగ్

డిస్నీ నుంచి వస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్(Mufasaa, the lion king). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న రిలీజ్ కు రెడీ అవుతోంది. అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ విడుదల కానుంది. హిందీలో ముఫాసా క్యారెక్టర్ కు షారుఖ్ ఖాన్(Sharukh khan) డబ్బింగ్ చెప్పగా..తెలుగులో మహేశ్ బాబు(Mahesh babu) వాయిస్ ఇస్తున్నారు.

ఈ విషయాన్ని ముఫాసా, ది లయన్ కింగ్ టీమ్ అనౌన్స్ చేసింది. హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలను మహేశ్ బాగా ఇష్టపడతారు, ముఫాసా, ది లయన్ కింగ్ సినిమాలో లీడ్ రోల్ కు వాయిస్ ఇవ్వడాన్ని కూడా మహేశ్ ఎంజాయ్ చేశారని టీమ్ చెబుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 26న రిలీజ్ కానుంది.