షారుఖ్, సుకుమార్ కాంబోలో భారీ చిత్రం

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, టాప్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబోలో మూవీ అంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ఇలా లీకైందో లేదో అలా వెంటనే వైరల్ అయ్యింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో సుకుమార్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడు షారుఖ్. ఇటీవల షారుఖ్, సుకుమార్ ఇద్దరి మధ్య లాంగ్ మీటింగ్ కూడా జరిగిందట. ఈ మీటింగ్ లో తన కోసం ఏదైనా కథ ఉంటే చెప్పమని షారుఖ్ అడగడం.. దీనికి తన దగ్గర ఉన్న రూరల్ మాస్ స్టోరీ చెప్పడం జరిగిందట.

ఖచ్చితంగా వీరిద్దరి కాంబోలో సినిమా ఉండడం ఖాయం అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ క్రేజీ కాంబోలో మూవీ ఎప్పుడు ఉండచ్చు అనేది ఆసక్తిగా మారింది. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేసే సినిమా కోసం కథ పై కసరత్తు చేస్తున్నారు. చరణ్ బుచ్చిబాబుతో చేస్తోన్న మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. రామ్ చరణ్ తో సినిమా పూర్తైన తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప 3 చేయాలి. ఈ రెండు సినిమాలు పూర్తవ్వడానికే ఎంత లేదన్నా నాలుగు సంవత్సరాలు పైనే పడుతుంది. ఆతర్వాత షారుఖ్, సుకుమార్ కాంబోలో ఉండచ్చు.