దిల్ రాజు ప్రొడక్షన్స్ బలగం వంటి క్లాసిక్ హిట్ తో తన జర్నీ స్టార్ట్ చేసింది. ఈ ప్రొడక్షన్ లో బడ్జెట్ సినిమాలతో యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఇప్పటికి మూడు సినిమాలు తెరకెక్కగా..ఇప్పుడు నాలుగో సినిమా సుహాస్ హీరోగా రూపొందుతోంది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుహాస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. జనక అయితే గనక అనే టైటిల్ ను ఈ సినిమాకు కన్ఫర్మ్ చేశారట. మే 24న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. జనక అయితే గనక సినిమా పోస్టర్ ను ఇవాళ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. చిన్న బాబు త్రాసును పట్టుకుని నవ్వుతున్న ఫొటో రిలీజ్ చేశారు. టైటిల్ ను అఫీషియల్ గా త్వరలో అనౌన్స్ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.