పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ దక్కించుకోవడంతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై అందరి ప్రశంసలు దక్కించుకున్న సినిమా ‘ముత్తయ్య’. ఈ సినిమా త్వరలో ఈటీవీ విన్ లో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. ఫస్ట్ సాంగ్ అరవైల పడుసోడు పాటను ఈ రోజు స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సమంత ఒక మంచి మూవీకి సపోర్ట్ గా నిలుస్తూ ఎంకరేజ్ చేయడం అభినందనీయం.
‘అరవైల పడుసోడు..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్వ్ సూపర్ హిట్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. శివకృష్ణ చారి ఎర్రోజు క్యాచీ లిరిక్స్ రాయగా, విద్యాసాగర్ బంకుపల్లి ఆకట్టుకునేలా పాడారు. ‘ముత్తయ్య’ సినిమాలో కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈటీవీ విన్ లో ప్రీమియర్ కు రెడీ అవుతున్న ముత్తయ్య సినిమాపై మూవీ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.