100 రోజుల్లో ప్రెగ్నెన్సీ ఎలా ? – ఆకట్టుకుంటున్న “సంతాన ప్రాప్తిరస్తు” టీజర్

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీజర్ ఎంటర్ టైన్ మెంట్ ఫ్లస్ ఎమోషన్ తో ఆకట్టుకుంటోంది. ఈరోజు యూత్ కు పిల్లల్ని కనడం అనేది పెద్ద సమస్యగా మారింది. గతంలో ఎక్కడో ఒకటి కనిపించే ఫెర్టిలిటీ సెంటర్స్..ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. రొటీన్ లైఫ్ లో స్ట్రెస్ తో కొత్త జంటలు ప్రెగ్నెన్సీ కోసం తపిస్తున్నాయి. ఇలాంటి సోషల్ ఇష్యూను ఫన్ ఎలిమెంట్స్ తో కలిపి అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో చూపిస్తున్నారు.

“సంతాన ప్రాప్తిరస్తు” టీజర్ లో హీరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. బాడీ మూవ్ మెంట్ లేని ఏసీ రూములో స్ట్రెస్ జాబ్..సాయంత్రం ఫ్రెండ్స్, పార్టీలు…ఇలాంటి లైఫ్ లీడ్ చేసే హీరో కల్యాణి( చాందినీ చౌదరి) అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. కల్యాణి ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం ఉండదు. పిల్లలు పుడితే వాళ్ల కోపం తగ్గుతుంది. కానీ ఇక్కడ హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి భార్యకు ప్రెగ్నెన్సీ రాదు. ఇలాంటి పరిస్థితుల్లో వంద రోజుల్లో భార్య కల్యాణిని ప్రెగ్నెంట్ చేయాలని గోల్ పెట్టుకుంటాడు. డాక్టర్ భ్రమరం(వెన్నెల కిషోర్) చికిత్సలు, స్నేహితులు చెప్పే చిట్కాలు, డైట్, ఎక్సర్ సైజ్ ఇలాంటివన్నీ పాటిస్తుంటాడు. ఇన్ని చేసినా హీరో గుడ్ చెప్పగలిగాడా లేదా అనేది టీజర్ లో ఆసక్తికరంగా చూపించారు.

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.