‘అరి’ సినిమాకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సపోర్ట్

చిన్న చిత్రాలు ప్రేక్షకులకు రీచ్ కావాలంటే స్టార్ హీరోలు, స్టార్ టెక్నీషియన్స్ సపోర్ట్ అవసరం. అలాంటి సపోర్ట్ ‘అరి’ సినిమాకు అందించేందుకు ముందుకొచ్చారు ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్. ‘అరి’ సినిమా నుంచి భగ భగ సాంగ్ ను ఆయన ఈ రోజు రిలీజ్ చేశారు. సాంగ్ కాన్సెప్ట్ చాలా బాగుందన్న నాగ్ అశ్విన్..‘అరి’ సినిమా విజయాన్ని అందుకోవాలని కోరారు.

తను బాగుండాలనే ఒకే ఒక లక్ష్యంతో మనిషి ఈ ప్రకృతిలోని ప్రతి అందాన్నీ ధ్వంసం చేస్తూ జీవిస్తున్నాడు. తన స్వార్థం కోసం మనిషి మృగంలా మారుతున్నాడు. ఈ క్రమాన్ని పాటలో ఆవిష్కరిస్తూ భగ భగ సాంగ్ ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. వనమాలి లిరిక్స్ రాయగా. షణ్ముక ప్రియ, రోహిత్ పీవీఎన్ఎస్ పాడారు.

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D ‘అరి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. “అరి” సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది.