సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. రీసెంట్ గా ఒడిశ్సాలో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా కోసం రాజమౌళి స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నారట. తన గత చిత్రాల్లా ఎక్కువ టైమ్ తీసుకోకుండా వీలైనంత ఫాస్ట్ గా మూవీ కంప్లీట్ చేసే యోచనలో రాజమౌళి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
అలాగే ఎస్ఎస్ఎంబీ 29 సినిమా రెండు పార్టులుగా ఉంటుందని ఇప్పటిదాకా అంతా భావించారు. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఒకే చిత్రంగా ఈ ప్రాజెక్ట్ చేయాలని డైరెక్టర్ రాజమౌళి నిర్ణయించారట. ఆఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా గ్లోబల్ గా క్రేజ్ తెచ్చుకునేలా ఎస్ఎస్ఎంబీ 29ను రూపొందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.