సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి క్రేజీ కాంబో మూవీ ఎస్ఎస్ఎంబీ 29 రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలో మహేశ్, హీరోయిన్ ప్రియాంక ఉన్న కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. గచ్చిబౌలి అల్యుమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబీ 29 షెడ్యూల్ జరుగుతోంది.
గతంలో బాహుబలి సీన్స్ సెట్స్ నుంచి లీక్ అయిన నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఒక్క స్టిల్ కూడా బయటకు రాకుండా గట్టి సెక్యూరిటీ మధ్య ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కోసం టీమ్ ఫారిన్ వెళ్తున్నారు. మేజర్ షూటింగ్ పార్ట్ అంతా విదేశాల్లోనే చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం మార్చి ఫస్ట్ వీక్ లో టీమ్ అంతా ఫారిన్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారట. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో గ్లోబల్ ప్రాజెక్ట్ గా ఎస్ఎస్ఎంబీ 29 తెరకెక్కుతోంది.