సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కలిసి చేస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా లాంఛింగ్ కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జనవరి రెండోవారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. షూటింగ్ కు మరికొంత టైమ్ తీసుకుంటారట.
అఫీషియల్ గా సినిమాను లాంఛ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఒక కొత్త లుక్ లోకి మారిపోయారు. ఎస్ఎస్ఎంబీ సినిమా ఆఫ్రికన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉండనుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. పలువురు హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేయనున్నారు.