సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సింహంతో తీసుకున్న ఫొటో దగ్గర పాస్ పోర్ట్ చూపిస్తూ క్యాప్చర్డ్ అనే క్యాప్షన్ రాశారు రాజమౌళి. ఈ పోస్ట్ కు మహేశ్ బాబు స్పందిస్తూ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రిప్లై ఇచ్చారు. పోకిరీ సినిమాలోని ఈ డైలాగ్ తో మహేశ్ ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది.
అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఎస్ఎస్ఎంబీ 29 తెరకెక్కనుంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మహేశ్ కు జోడీగా కనిపించనుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. మహేశ్, రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమా తెలుగు నుంచి వస్తున్న మరో గ్లోబల్ ప్రాజెక్ట్ గా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.