“జైలర్ 2” లో “కేజీఎఫ్” హీరోయిన్

కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ కు తగినన్ని ఆఫర్స్ ఆమెకు రాలేదు. విక్రమ్ తో కోబ్రాలో కలిసి నటించిన శ్రీనిధి..తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాలో నటిస్తోంది. ఇంతలో ఆమెకు కోలీవుడ్ నుంచి మరో బిగ్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కేజీఎఫ్ తర్వాత మరో భారీ మూవీలో ఆమెకు ఛాన్స్ దొరికినట్లే అనుకోవాలి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ రూపొందిస్తున్నారు. త్వరలోనే జైలర్ 2 అప్డేట్ ఇవ్వబోతున్నారు.