యంగ్ హీరో శ్రీ విష్ణు అంటే ఎక్కువగా లైటర్ వేన్ సినిమాలే గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్, కామెడీ, లవ్ విత్ యాక్షన్ మూవీస్ చేస్తూ పేరు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పుడు తన ఇమేజ్ కు భిన్నమైన ప్రయత్నం చేస్తున్నాడీ హీరో. మృత్యుంజయ టైటిల్ తో తన కొత్త మూవీని ఈరోజు అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తుండటం విశేషం.
ఇది శ్రీ విష్ణుకు కొత్త జానర్. ఇలాంటి జానర్ లో శ్రీ విష్ణు మూవీస్ చేయలేదు. హిస్టారికల్ ఫాంటసీ నేపథ్యంతో చేసిన స్వాగ్ మూవీ ఫ్లాప్ నేపథ్యంలో మళ్లీ తనను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు శ్రీ విష్ణు. మృత్యుంజయ ఆ ప్రయత్నంలో భాగమే అనుకోవచ్చు. సామజవరగమన తర్వాత ఈ చిత్రంలో హీరోయిన్ రెబా మోనికా జాన్ మరోసారి శ్రీ విష్ణుకు జోడీగా కనిపించనుంది.