నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను రూపొందించి ఘన విజయాన్ని అందుకుకున్నారు దర్శకుడు పి.మహేశ్ బాబు. ఒక ఇన్నోవేటివ్ పాయింట్ తో సకుటుంబ ప్రేక్షకులు చూసేలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కించి పేరు తెచ్చుకున్నారు పి. మహేశ్ బాబు. ఆయనకు శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారి ఉగాది పురస్కారం దక్కింది.
ఉత్తమ దర్శకులకు ఇచ్చే బాపు రమణ పురస్కారాన్ని పి.మహేశ్ బాబుకు అందించారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజుల తెలుగు సినిమాలకు, తెలుగు సినిమా పరిశ్రమ సెలబ్రిటీస్ కు ఉగాది పురస్కారాలు ఇస్తుంటుంది శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్.