తన క్రేజ్ కు ఇప్పట్లో ఏమాత్రం ఢోకా లేదని ప్రూవ్ చేసుకుంటోంది హీరోయిన్ శ్రీలీల. తెలుగు తమిళ హిందీ మూవీస్ తో వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. ఇంత బిజీగా ఉన్న శ్రీలీల అరడజనుకు పైగా ఫ్లాప్ మూవీస్ చేసి కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేదాకా వచ్చిన హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను సంప్రదించారట మూవీ టీమ్. ఈ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలో రానుందని తెలుస్తోంది. శ్రీలీల రాబిన్ హుడ్ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ఖాతాలో రవితేజ మాస్ జాతర, తమిళంలో పరాశక్తి, హిందీలో ఆషికీ 3 తదితర చిత్రాలున్నాయి.