శ్రీలీల చెప్పింది నిజమేనా

పెళ్లి సందడి సినిమాలో డ్యాన్సులు, అందంతో మెస్మరైజ్ చేసి టాలీవుడ్ లోకి ఒక వేవ్ లా వచ్చింది శ్రీలీల. ధమాకా సినిమాలో ఏం లేకపోయినా పాటలు, శ్రీలీల డ్యాన్సులతోనే సక్సెస్ అయ్యింది. దీంతో శ్రీలీలకే క్రెడిట్ వచ్చింది. ఇక వరుసగా మూవీస్ చేస్తూ వెళ్లింది శ్రీలీల. ఆ సినిమాలన్నీ స్టార్ హీరోలతో కావడంతో తన క్యారెక్టర్ ఏంటి, సినిమాలో తాను చేసేందుకు ఏమైనా స్కోప్ ఉందా..అలాంటివేం ఆలోచించలేదు. తన డ్యాన్సులపైనే నమ్మకం పెట్టింది. ఏడాది తిరిగే సరికి శ్రీలీల సినిమాలు వరుసగా రిలీజ్ కావడం మొదలైంది. అవన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. శ్రీలీలకు నటిగా ఏమాత్రం పేరు రాలేదు. ఆమె క్రేజ్ కూడా పోయింది.

ఈ నేపథ్యంలో శ్రీలీలతో ముందుగా కమిట్ అయిన మూవీస్ నుంచి కూడా ఆమెను తప్పించారు. 90 పర్సెంట్ మూవీస్ ఆమెకు తగ్గిపోయాయి. ఎడాపెడా సినిమాలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ మూల నుంచి ఈ మూల దాకా షాప్ ఓపెనింగ్ లు చేస్తూ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ వచ్చింది. చివరకు శ్రీ చైతన్య కాలేజీలకు కూడా అడ్వర్టైజ్ చేసింది. సరైన సినిమాలు సెలెక్ట్ చేసుకోక ఆమెకు ఆఫర్స్ తగ్గిపోగా తన కొత్త సినిమా రాబిన్ హుడ్ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ తాను లాస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుకుంటున్నందు వల్ల సినిమాలు చేయలేకపోయానని అంటోంది. అందుకే తనకు మూవీస్ తగ్గాయని చెబుతోంది.