ఇంత బిజీలో శ్రీలీలకు మరో ఆఫర్

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా సూపర్ హిట్టయ్యింది. 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ లో శ్రీలీల బ్యూటీ, డ్యాన్సులకు బాగా క్రెడిట్ వచ్చింది. ఈ హిట్ ఫెయిర్ మరోసారి తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవితేజ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ చిత్రం మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ టీమ్ లోకి శ్రీలీల రావడంతో మరింతగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు పది సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న శ్రీలీలకు రవితేజ సినిమా మరో మంచి ఆఫర్ గా చెప్పుకోవచ్చు.