టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీలీల జోరు ఎలా ఉందంటే…ప్రతి నెలా ఆమె సినిమా ఒకటి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇలా రాబోయో ఆర్నెళ్లు శ్రీలీలకు సినిమాలు ఉన్నాయి. వరదలా వచ్చి పడుతున్న ఆఫర్స్ కు డేట్స్ కేటాయించలేక కొన్ని సినిమాలు వదిలేస్తోంది.
శ్రీలీల కొత్త సినిమా స్కంధ రేపు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తోంది శ్రీలీల. ఈ ఇంటర్వ్యూస్ లో తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిందీ యంగ్ హీరోయిన్. లవ్ గురించి శ్రీలీల స్పందించింది.
తాను ప్రస్తుతం లవ్ లో లేనని, గతంలోనూ ఎవర్నీ ప్రేమించలేదని శ్రీలీల చెప్పింది. అయితే ప్రేమ మీద తనకు మంచి అభిప్రాయం ఉందని, సరైన వ్యక్తి దొరికితే ప్రేమించడానికి రెడీ అనీ చెప్పింది. అలాగే అతనితో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసేందుకు కూడా సిద్ధమేనంది. శ్రీలీల ఇంటర్వ్యూలో చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు నెటిజన్స్.