ఇప్పటి వరకు టాలీవుడ్ పైనే దృష్టి పెట్టిన శ్రీలీల ఇప్పుడు రూటు మార్చింది. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకోబోతోందని ముంబై టాక్. కార్తీక్ ఆర్యన్ హీరోగా సమీర్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించబోయే సినిమాలో హీరోయిన్ అవకాశం ఈ అమ్మడికే దక్కబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం చర్చల దశలో ఉందట. నిజానికి శ్రీలీలకు ముందు ప్రతిపాదన వచ్చింది ఇది కాదు. వరుణ్ ధావన్ హీరోగా ఆయన తండ్రి డేవిడ్ ధావన్ ప్లాన్ చేసుకున్న ఎంటర్ టైనర్ కోసం అడిగారు కానీ.. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. శ్రీలీల దాన్ని దాదాపు వదులుకున్నట్టే.
అసలే వరుణ్ మార్కెట్, ఇమేజ్ రెండూ డౌన్ లో ఉన్నాయి. కామెడీగా చేసిన కూలి నెంబర్ వన్ నుంచి మాస్ గా ట్రై చేసిన బేబీ జాన్ దాకా అన్నీ టపా కట్టేశాయి. కానీ కార్తీక్ ఆర్యన్ మంచి స్వింగ్ లో ఉన్నాడు. ఇటీవలే భూల్ భులయ్యా 3 పెద్ద హిట్టయ్యింది. పెద్ద ప్రొడక్షన్ కంపెనీలతో వరసగా సినిమాలు చేస్తూ బిజినెస్ పెంచుకుంటూ పోతున్నాడు. మరి శ్రీలీల ఎస్ చెప్పిందో లేదో ఇంకొద్దిరోజుల్లో తేలనుంది. ఆమె తెలుగులో నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. నితిన్ తో చేసిన రాబిన్ హుడ్ విడుదలకు సిద్దమవుతుంది. శివ కార్తికేయన్ తో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందబోయే భారీ చిత్రం ఇటీవలే మొదలైంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యాక డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రవితేజతో చేస్తోన్న మాస్ జాతర మే రిలీజ్ కు రెడీ అవుతోంది. 2025 నుంచి శ్రీలీల డైరిలో పేజీలు ఖాళీగా ఉండేలా కనిపించడం లేదు. మరో వైపు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మరింతగా క్రేజ్ పెంచుకోవాలనేది ఈ అమ్మడు ప్లాన్.