అక్కినేని హీరోలు నాగచైతన్య తండేల్ తర్వాత కార్తీక్ దండుతో సినిమా చేస్తున్నాడు. ఇక అఖిల్ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఇంత వరకు అనౌన్స్ చేయలేదు. అయితే.. అక్కినేని బ్రదర్స్ సినిమాల్లో కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఫిబ్రవరి 7న తండేల్ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేయనున్నాడు. ఈ మూవీని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇందులో చైతన్యకు జంటగా పూజా హేగ్డే నటిస్తుందని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాదని తెలిసింది. ఆతర్వాత మీనాక్షి చౌదరి పేరు ప్రచారంలోకి వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఇందులో శ్రీలీల నటిస్తుందని తెలిసింది. పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు చైతన్య సరసన నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది.
నాగచైతన్యతో నటించే ఛాన్స్ దక్కించుకున్న శ్రీలీల అక్కినేని అఖిల్ తో కూడా జంటగా నటించనుందని సమాచారం. అఖిల్.. ఏజెంట్ మూవీ తర్వాత ఇంత వరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. అయితే.. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో అఖిల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుండడం విశేషం. ఇందులో అఖిల్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో అనౌన్స్ చేయనున్నారు.