“జైలర్ 2″లో ‘డాకు…’ హీరోయిన్

రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసి చాలా రోజులే అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. కాస్టింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది.

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ను జైలర్ 2 లో కీ రోల్ కోసం తీసుకున్నారట. ఈ భామ ప్రస్తుతం డాకు మహారాజ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. గతంలో ఆమెకు జెర్సీ మూవీ సక్సెస్ కూడా ఉంది. జైలర్ 2 మూవీ శ్రద్ధాకు మరో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కానుంది. జైలర్ 2 సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్నారు.