దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు

రేణుకస్వామి అనే వ్యక్తి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ హీరో దర్శన్(Darshan) కు జైలులో రాచమర్యాదలు చేస్తున్నారు పోలీసులు. దర్శన్ కు సంబంధించిన ఓ జైలు(Jail) ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జైలులో కొందరు ఫ్రెండ్స్ తో కలిసి సిగరెట్స్ తాగుతూ డ్రింక్ చేస్తూ ఉందా ఫొటోలో.

ఈ ఫొటో సోషల్ మీడియాలోకి రాగానే ట్రోలింగ్ మొదలైంది. కన్నడ జైలు అధికారులు నేరస్తులకు ఇలాంటి మర్యాదలు చేయడంపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. తన ప్రేయసి పవిత్ర గౌడతో కలిసి రేణుకస్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడు దర్శన్.