శూలాన్ని చేతపట్టిన విశ్వంభరుడు

నేడు మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) పుట్టినరోజు(Birthday). ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా విశ్వంభర(Vishwambhara) నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శూలాన్ని చేతబట్టి విశ్వాన్ని కాపాడేందుకు ముందుకొచ్చిన వీరుడిగా చిరంజీవి లుక్ కనిపిస్తోంది. వాస్తవానికి ఈ రోజు టీజర్ రిలీజ్ చేస్తారని అంతా ఆశించారు. కానీ స్పెషల్ పోస్టర్ తో మూవీ టీమ్ సరిపెట్టారు.

విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్(UV creations) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు వశిష్ట(Vashista) రూపొందిస్తున్నారు. త్రిష(Trisha), ఆషికా రంగనాథ్(Ashika ranganath) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విశ్వంభర థియేటర్స్ లోకి రాబోతోంది.