సోనమ్ కపూర్ గురించి ఇటీవల కింగ్స్ ఆఫ్ కోతా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నెగిటివ్ కామెంట్స్ చేశారు హీరో రానా. ఆ తర్వాత ఈ విషయంపై ఆయన సారీ చెబుతూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అయినా సోనమ్ కపూర్ శాంతించినట్లు లేదు. ఇవాళ రానాను ఉద్దేశిస్తూ పరోక్షంగా కామెంట్స్ చేసిందీ బ్యూటీ. ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ తో రానా మాటలకు కౌంటర్ ఇచ్చింది.
కింగ్స్ ఆఫ్ కోతా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ….ది జోయా ఫ్యాక్టర్ సినిమాలో నేను, దుల్కర్ కలిసి నటించాం. ఆ సినిమాలో నటించే ఓ హీరోయిన్ తన భర్తతో ఫోన్ మాట్లాడుతూ మా టైమ్ వేస్ట్ చేసేది. ఆమె మాట్లాడేది ఏమంత సీరియస్ మ్యాటర్ కాదు. భర్త విదేశాల్లో షాపింగ్ చేస్తుంటే…ఆ షాపింగ్ ఎలా జరుగుతుందో కనుక్కునేది. ఇక్కడ సీన్స్ షాట్ కోసం మేం వెయిట్ చేసేవాళ్లం. చాలాసేపటి తర్వాత సెట్స్ లోకి వచ్చి కెమెరా ముందు సరిగ్గా డైలాగ్స్ చెప్పలేకపోయేది. నాకు కోపం వచ్చేది కానీ దుల్కర్ సహనంతో తన పార్ట్ కంప్లీట్ చేసి వెళ్లిపోయేవాడు. షూటింగ్ ప్యాకప్ అయ్యాక ప్రొడ్యూసర్స్ ను పిలిచి తిట్టాను… అని చెప్పారు.
ఆ సినిమాలో నటించింది సోనమ్ కాబట్టి రానా కామెంట్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి. దీంతో రానా నేను సరదాగా చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సోనమ్, దుల్కర్ కు సారీ చెప్పాడు. ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేయాలని కోరాడు. అయితే సోనమ్ మాత్రం అంత ఈజీగా మర్చిపోలేదు. కుంచిత స్వభావం గలవారే ఇతరుల్ని విమర్శిస్తారంటూ ఎలెనార్ రూజ్ వెల్ట్ కొటేషన్ కోట్ చేస్తూ రానాను విమర్శించింది. ఎలెలార్ రూజ్ వెల్ట్ ఒకప్పటి అమెరికన్ అధ్యక్షుడు ఫ్లాంక్లిన్ రూజ్ వెల్ట్ భార్య.