మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారంలో ముగ్గురు హీరోయిన్స్ ఉండటం సర్ ప్రైజింగ్ గా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల మెయిన్ లీడ్ హీరోయిన్స్ కాగా…నేనూ ఉన్నానంటూ మీనాక్షి చౌదరి ఈ సినిమాలో నటించిన ఎక్సీపిరియన్స్ తాజాగా హత్య సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వెల్లడించింది. గతంలో త్రివిక్రమ్ తన సినిమాలు అరవింత సమేత వీర రాఘవలో ఈషా రెబ్బా, అల వైకుంఠపురములో సినిమాలో నివేదా పేతురాజ్ ను ఇలాగే సైడ్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ కు తీసుకున్నాడు. మీనాక్షిది గుంటూరు కారంలో అలాంటి పాత్రేనా అనే డౌట్స్ వస్తన్నాయి.
హిట్ 2 తో మంచి సక్సెస్ దక్కినా మీనాక్షికి తగినన్ని ఆఫర్స్ లేవు. రావాల్సినంత క్రేజ్ రాలేదు. అయితే మరీ చిన్న క్యారెక్టర్ కు తీసుకున్నా ఆమె ఇమేజ్ కు సరైంది కాదు. మహేశ్ లాంటి హీరో ఉండగా..పూజా హెగ్డే, శ్రీలీలతో పాటు మీనాక్షి కూాడా ఇంపార్టెన్స్ ఉంటే గుంటూరు కారం కథ చాలా పెద్దదే అయి ఉండాలి. ఎందుకంటే కథలో ప్రాధాన్యత అంతా హీరోకే ఉంటుంది. ఏమైనా మీనాక్షి ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించడమే ముఖ్యమని అనుకుని ఉంటుంది.