సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ ఓటీటీలో ఆగస్ట్ 24 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. గత నెల 29న ఈ సినిమా థియేటర్ లలో విడుదలైంది. ఈ చిత్రాన్నిరిలయన్స్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. మ్యారేజ్ నేపథ్యంగా సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు.
థియేటర్స్ లో కొన్ని సెక్షన్ ఆడియెన్స్ కు నచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుందనే ఆశాభావం టీమ్ లో వ్యక్తమవుతోంది. ఇంట్లో కూర్చుని కుటుంబమంతా ఓటీటీలో స్లమ్ డాగ్ హజ్బెండ్ మూవీ చూసేందుకు ఆసక్తి కనబరుస్తారని చిత్రబృందం ఆశిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడే కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ వంటి ఎలిమెంట్స్ ఉండటం ఈ సినిమాకు ఓటీటీ రిలీజ్ లో ఫ్లస్ పాయింట్ కాబోతోంది.