దిద్దుబాటు చర్యల్లో “స్కంధ”, ఫైనల్ ట్రైలర్ కట్ చేస్తారట

హీరో రామ్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కంధ. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్కంధ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి…ఆ వేదిక మీదే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ మొదలైంది.

సాధారణంగా డైరెక్టర్ బోయపాటి సినిమా ఫలితం ఎలా ఉన్నా…ఆయన సినిమాల ట్రైలర్స్ మాత్రం హై ఎమోషన్, యాక్షన్ తో ఆకట్టుకుంటాయి. కానీ స్కంధ ట్రైలర్ ఈ ఎఫెక్ట్ తీసుకురాలేకపోయింది. దీంతో అప్పటిదాకా సినిమా మీదున్న అంచనాలు కూడా ట్రైలర్ రిలీజ్ తో తగ్గిపోయాయి. ఇక ఈ తప్పును సరిచేసేందుకు దిద్దుబాటు చర్యలకు మూవీ టీమ్ దిగినట్లు కనిపిస్తోంది. స్కంధ ఫైనల్ ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం రిలీజ్ చేసిన ట్రైలర్ లో యాక్షన్ విపరీతంగా ఉండి మిగతా అంశాలు తగ్గిపోయాయి. ఈసారి అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ మంచి బీజీఎంతో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.