రాజకీయాల్లోకిి రావడం లేదంటున్న సింగర్

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. సింగర్ గా తన కెరీర్ కొనసాగిస్తానని, రాజకీయాలపై తనకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల కొద్ది రోజులుగా రాహుల్ సిప్లిగంజ్ రాజకీయ అరంగేట్రం గురించి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలపై స్పందించారు రాహుల్ సిప్లిగంజ్. రాజకీయాల్లోకి రమ్మని ఏ పార్టీ తనను అప్రోచ్ కాలేదని, అలాగే తాను కూడా ఏ పార్టీ దగ్గరకు టికె ట్ కోసం వెళ్లలేదని రాహుల్ తన పోస్ట్ లో తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా తాను సాధించాల్సింది చాలా ఉందని రాహుల్ పేర్కొన్నారు.